బాబు, కిరణ్.. ఓ దొంగాట



































సభలో రక్తికట్టిన ‘అవిశ్వాసం’ డ్రామా
* అవిశ్వాసాన్ని అటకెక్కించిన కాంగ్రెస్, టీడీపీ
* ఆ ఊసే ఎత్తని బాబు; తప్పించుకున్న కాంగ్రెస్
* అవిశ్వాస గండం నుంచి సర్కారును గట్టెక్కించేందుకే స్పీకర్, డిప్యూటీలకు టీడీపీ పోటీ!
* చివరి క్షణంలో బహిరంగ ఓటింగ్ పద్ధతి తెచ్చినా అభ్యంతరపెట్టని చంద్రబాబు
* మూజువాణి ఓటుతో స్పీకర్ గెలిచినట్టు ప్రకటించినా, ‘డివిజన్’కు పట్టుబట్టిన బాబు
* తద్వారా ప్రభుత్వ ‘బల నిరూపణ’కు శాయశక్తులా సాయపడ్డ విపక్ష నేత
* అంతా అయిపోయాక రాజ్‌భవన్ వద్ద బాబు హైడ్రామా
* స్పీకర్, డిప్యూటీ గెలుపుతోనే బలం నిరూపితమైందన్న సీఎం

అనుకున్నదే జరిగింది. అంతా ‘నారా-నల్లారి’ స్క్రిప్టు ప్రకారమే పక్కాగా జరిగిపోయింది. ‘మ్యాచ్ ఫిక్సింగ్’ సిరీస్‌లో మరో అంకాన్ని అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ దిగ్విజయంగా పూర్తి చేశాయి. పరస్పర అవగాహనతో శనివారం సభాపర్వాన్ని ఆద్యంతమూ రక్తి కట్టించాయి. ఇదుగో అవిశ్వాసమంటూ బీరాలు పలికి, రంకెలు వేసిన టీడీపీ; పెడితే తడాఖా చూపుతామంటూ తొడగొట్టిన కాంగ్రెస్ చివరకు నోటీసు ఊసైనా ఎత్తకుండానే జారుకున్నాయి. రాష్ట్ర ప్రజల సాక్షిగా, హైడ్రామా నడుమ, అవిశ్వాస తీర్మానాన్ని ఎంచక్కా అటకెక్కించి చేతులు దులుపుకున్నాయి. అంతేనా...? ప్రభుత్వానికి మెజారిటీ ఉందని ఎలాగైనా నిరూపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదాలో టీడీపీయే పెద్ద మనసుతో ముందుకొచ్చింది! స్పీకర్ ఎన్నిక ముగిసిన తర్వాత కూడా, ‘అదేం కుదరదు. దానిపై డివిజన్ పెట్టాల్సిందే’ అని స్వయానా చంద్రబాబే పట్టుబట్టారు. తద్వారా ప్రభుత్వం ‘బల నిరూపణ’ చేసుకునేందుకు శాయశక్తులా సహకరించి తరించారు...! మొత్తానికి కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ బంధానికి అసెంబ్లీ సాక్షిగా రాజముద్ర పడ్డట్టయింది.

హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానంపై శనివారం కాంగ్రెస్, టీడీపీ సభలో నాటకీయంగా వ్యవహరించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధాన ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని అవిశ్వాస గండం నుంచి గట్టెక్కించింది. స్పీకర్, డి ప్యూటీ స్పీకర్ ఎన్నికకు సభను సమావేశపరచాలన్న ప్రభుత్వ నిర్ణయం, సరిగ్గా అదే సమయంలో అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ అవిశ్వాస నోటీసివ్వడం యాదృచ్ఛికం కాదని, ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. నిజానికి 40 ఏళ్లుగా రాష్ట్రంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీయే జరగలేదు. 1971 నుంచీ వాటికి ఏకగ్రీవ ఎన్నికనే ఆనవాయితీగా పార్టీలు పాటిస్తున్నాయి. 2009లో 92 మంది సభ్యుల బలమున్నప్పుడు కూడా స్పీకర్ ఎన్నికకు బాబు పోటీ పెట్టలేదు. అలాంటిది ఈసారి మాత్రం పట్టుబట్టి మరీ పోటీ పెట్టడం, తీరా ఓటింగ్ సమయంలో దాన్ని అత్యంత ఆషామాషీగా తీసుకోవడం ద్వారా... ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించేందుకు మాత్రమే టీడీపీ పాటుపడినట్టయింది! ఈ రకంగా కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితులు కల్పించడమే అసలు ఉద్దేశమన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం టీడీపీ కనీసం డిమాండ్ కూడా చేయని వైనం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. స్పీకర్ ఎన్నిక తమకు ప్రధానం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం, అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే తమ సత్తా చూపుతామని ప్రకటించడం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం నోటీసును చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం బహిరంగ లేఖ కూడా రాశారు. దాంతో బాబు ఒక్కసారిగా కంగారు పడ్డారు. తమ అవిశ్వాసం నాటకం ఓటింగ్ దాకా వెళ్తే మొదటికే మోసం తప్పదని అనుమానించారు. దాంతో ఒక్కసారిగా రూటు మార్చారు. స్పీకర్ ఎన్నికను అడ్డుపెట్టుకొని ‘అవిశ్వాసానికి’ చేజేతులా గండికొట్టారు. విపక్ష నేత హోదాలో అధికార పార్టీని ఆదుకున్నారు!

రహస్యమా.. బహిరంగమా!
అవిశ్వాసం దాకా వెళ్లకుండా... ఎలాగోలా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికనే ‘బలపరీక్ష’ చూపేందుకు అధికార, విపక్షాలు నానా విన్యాసాలు చేశాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను కూడా నాటకీయ మలుపులు తిప్పాయి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిన జరుగుతాయని అన్ని పార్టీలకూ ముందు రోజే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ మేరకు అసెంబ్లీ లోపల క్యాబిన్లను కూడా ఏర్పాటు చేశారు. తీరా ఎన్నిక సమయానికి ఓపెన్ బ్యాలెట్ పద్ధతికి మార్చడం వ్యూహంలో భాగమేననితెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని టీడీపీ సవాలు చేయడం కాదు కదా, కనీసం వ్యతిరేకించనూ లేదు. గాలి ముద్దుకృష్ణమనాయుడితో రెండు ముక్కలు మాట్లాడించి సరిపెట్టింది. దాంతో సభ్యులంతా చేతులెత్తే పద్ధతిలో స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ ముగించారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మూజువాణి ఓటుతో స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ ఎన్నికైనట్టు ప్రకటించారు. దాంతో ఎందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పక్షాన నిలిచారన్నది స్పష్టం కాలేదు.

‘బలపరీక్ష’ ఆశయం నెరవేరకపోవడంతో మరో కీలక నాటకానికి బాబు-కిరణ్ తెర తీశారు! స్పీకర్ ఎన్నికకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చిందీ స్పష్టంగా తెలిసేలా ‘డివిజన్’ కావాల్సిందేనని ముందుగా బాబు, ఆ తర్వాత కిరణ్ గట్టిగా పట్టుబట్టారు. తద్వారా ఎన్నడూ లేని విధంగా స్పీకర్ ఎన్నిక రెండోసారి జరిగేందుకు కారకులయ్యారు! అనుకున్నది జరగగానే, ‘మాకు బలముందని స్పీకర్ ఎన్నికతో తేలిపోయింది కాబట్టి ఇక అవిశ్వాస తీర్మానం అక్కర లేదు’’ అని ముందస్తుగా సిద్ధం చేసుకున్న వాదనను ప్రభుత్వం మొదలుపెట్టింది. అవిశ్వాసాన్ని బలపరుస్తామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు కూడా ‘డివిజన్’ డ్రామా ద్వారా ప్రయత్నించారని చెబుతున్నారు.

కాడి కింద పడేసిన టీడీపీ
ప్రభుత్వంపై అవిశ్వాసంతోనే స్పీకర్, డిప్యూటీ పదవులకు పోటీ పెడుతున్నామని, అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ కొండంత రాగం తీసిన టీడీపీ, చివరకు తన సభ్యుల ఓట్లను కూడా పూర్తిగా ‘వేయించుకోలేకపోయింది’. టీడీపీ స్పీకర్ అభ్యర్థికి 90 ఓట్లు వస్తే, కేవలం అరగంట వ్యవధిలోనే జరిగిన డిప్యూటీ స్పీకర్ అభ్యర్థికి మాత్రం 88 ఓట్లే వచ్చాయి. ఆ ఎన్నిక సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ‘లేకపోవడమే’ ఇందుకు కారణం! ఈ ఎన్నికలను టీడీపీ ఎంత తేలిగ్గా తీసుకుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. పైగా బాబు స్పీకర్ ఎన్నికపై మాట్లాడుతూ ఎప్పుడో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తావించారు. వాటిలో జెడ్పీటీసీలు అమ్ముడుపోయారని, ఎమ్మెల్యేలను కూడా నడిబజారులో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని సంబంధం లేని విషయాలు చెప్పుకొచ్చారు.

అంతే తప్ప నిన్నటిదాకా వీర హడావుడి చేసిన అవిశ్వాస తీర్మాన నోటీసు గురించి మాత్రం పొరపాటున కూడా ఒక్క మాటైనా మాట్లాడలేదు. సభ వాయిదా పడేదాకా ఆ విషయమే తన నోట రాకుండా బహుజాగ్రత్త పడ్డారు! తర్వాత ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి సందర్భంగా దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘సభలో బాబుకు మాట్లాడేందుకు అవకాశమిచ్చాను. అవిశ్వాస నోటీసుపై ప్రస్తావిస్తారనుకున్నాను. కానీ దాన్ని బాబు వినియోగించుకోలేదు. నేనేం చేసేది?’’ అన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికే టీడీపీ శాయశక్తులా కృష్టి చేస్తున్నట్టు కన్పిస్తోందని దాని 

No comments :

Post a Comment

Total Pageviews

Status