సభాపర్వంలో సామాన్యుడికి ఒరిగిందేమిటి?
* అన్నదాత ధాన్యానికి మద్దతు లభించిందా?
* విద్యార్థి చదువుకు ఫీజు రాయితీ దక్కిందా?
* మహిళలకు పావలా వడ్డీ రుణం వచ్చిందా?
* సభలో సమస్యల కనీస ప్రస్తావనైనా ఉందా?
* అసెంబ్లీలో పోటీపడింది కాంగ్రెస్, టీడీపీ అయితే.. జగన్ చేతులెత్తేశారంటూ ‘ఎల్లో’ రాతలు
* సభలో అవిశ్వాసం ఊసే ఎత్తని చంద్రబాబు... సభ ముగిశాక బయటకొచ్చి అంకమ్మ శివాలు
* ‘సర్కారు బలం’ చాటటానికే ఇంత డ్రామా.. ప్రతిపక్షమని చెప్పుకోవడానికిటీడీపీ తంటాలు
* కుటిల రాజకీయంతో ప్రజాస్వామ్యం అపహాస్యం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్నది కాంగ్రెస్... ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది తెలుగుదేశం..! స్పీకర్, డిప్యూటీస్పీకర్ ఎన్నికల్లో పోటీ చేసింది ఈ రెండు పార్టీలే..! గెలుపైనా, ఓటమైనా.. ఈ రెండు పార్టీలదే..! మధ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎక్కడిది?! వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతులు ఎత్తేశారంటూ పచ్చ మీడియా పిచ్చిరాతలు ఏమిటి?! సర్కారుపై కారాలూ మిరియాలూ నూరిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు.. సభ జరుగుతుండగా అవిశ్వాసం ఊసెత్తలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారు ఎంచక్కా సభను నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్లిపోయింది.
అధికార పక్షం - ప్రతిపక్షం మధ్య సాగుతున్న ఈ తెరచాటు పొత్తేమో.. ఎల్లో మీడియా కళ్లకు కనిపించదట!! ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతోంటే.. సభలో ఆ సమస్యల ప్రస్తావనైనా రాకపోవటం.. ప్రధాన ప్రతిపక్షం తెచ్చే ప్రయత్నం చేయకపోవటం.. పచ్చ మీడియా కానలేదట!! స్పీకర్ ఎన్నికలో ఏ పాత్రా లేకున్నా, ఎలాంటి ప్రమేయం లేకున్నా... సభలో ఒకే ఒక్క సభ్యురాలున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బలం లేదని, ఆయన చేతులెత్తేశారని మాత్రం కనిపిస్తుందట!!
ధాన్యానికి మార్కెట్‌లో ధర లభించక అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్న మద్దతు కోసం.. ఉన్నత చదువులకు ఫీజుల రాయితీ అందక అల్లాడుతున్న విద్యార్థి లోకానికి ఆసరా కోసం.. పావలా వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్న ఆడపడుచులకు ఆలంబన కోసం.. ప్రజా సంక్షేమం పట్టని సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తన బాధ్యత నిర్వర్తించాలని.. జగన్ డిమాండ్ చేస్తే చంద్రబాబు చేసిందేమిటి? ఆర్భాటంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి చివరకు ఏం చేశారు? ఎవరి సంక్షేమం కోసం ఆ తీర్మానాన్ని అటకెక్కించారు? చంద్రబాబు చర్య వల్ల రైతులు, మహిళలు, విద్యార్థులకు ఏం మేలు జరిగింది? ఆయన చేష్టల వల్ల ఎవరు అన్యాయమయ్యారు? ఆయన గారి చలవతో గట్టెక్కిందెవరు? చదవండి మీకే తెలుస్తుంది...
రైతు సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ప్రయత్నంలో సఫలమయ్యేందుకు ఏ దశలోనూ సీరియస్‌గా ప్రయత్నించలేదు. ఎందుకంటే.. అసలు ఆయనకు సర్కారును సాగనంపే ఉద్దేశమే లేదు. కారణం.. సర్కారు కూలిపోతే ఎన్నికలు వస్తాయి... ఎన్నికలు వస్తే వై.ఎస్.జగన్ ప్రభంజనంలో కాంగ్రెస్‌తో పాటు తన అడ్రస్ కూడా గల్లంతవుతుందన్న భయం. అందుకే.. ఓ వైపు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్తూనే.. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టటం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేలతో శిబిరాలు నిర్వహించరాదని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించలేని ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి అర్హమైనది కాదని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు.. చివరికి ఎందుకు మాట మార్చారు? ప్రభుత్వాన్ని కూల్చేఉద్దేశం లేనప్పుడు జగన్ తన బలం నిరూపించుకోవాలని ఎందుకు సవాల్ చేసినట్లు? ఈ సవాల్‌ను, ఎల్లో మీడియా రాతలను చూస్తే.. రైతాంగ సమస్యలు పరిష్కారం కావటంకన్నా, విద్యార్థుల ఉజ్వల భవితకన్నా, మహిళల సాధికారతకన్నా, ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టని ప్రభుత్వం పడిపోవటం కన్నా.. తనకు కలలో కూడా నిద్ర లేకుండా చేస్తున్న జగన్‌కు బలం లేదని చెప్పటానికే.. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉందని చూపటానికే.. బాబు కంకణం కట్టుకున్నారని స్పష్టంకావటం లేదా?
40 ఏళ్లలో ఎన్నడూ లేని వింత...
అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన చంద్రబాబు.. దాని నుంచి దృష్టి మళ్లించటానికే శాసనసభ స్పీకర్ పదవికి పోటీచేయాలని సంకల్పించారన్నది తేటతెల్లం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీపడే అవకాశం ఉన్నా.. గడచిన 40 సంవత్సరాలలో రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఆ పదవికి ఎన్నిక జరగలేదే? అంతెందుకు 2004, 2009లో అదే పదవికి తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? అదే రోజు నోటిఫికేషన్ వెలువడిన శాసనమండలి చైర్మన్ పదవికి ఎందుకు పోటీ పడలేదు? ఇప్పుడు పోటీ చేయాలని నిర్ణయించినపుడు దానిని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నాడని సహకరించాలని తన మిత్రపక్షమైన సీపీఐని ఎందుకు కోరలేదు? అదే కోవలో టీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలను ఎందుకు సంప్రదించలేదు? పైగా అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ముందు మాట్లాడుతూ ఒక పార్టీ తరఫున గెలిచిన వారు ఆ పార్టీకే ఓటు వేయాలన్న నీతి వాక్యాలు ఎందుకు పలికారు? అలాంటప్పుడు ఏమాశించి స్పీకర్ పదవికి పోటీపడ్డారు?
సభలో ఆ ఊసే ఎత్తలేదు...
ఏ పార్టీ అయినా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తాను ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో స్పీకర్ ఎన్నికకు ముందు కానీ, తరువాత కానీ మాట్లాడేటప్పుడు అవిశ్వాస తీర్మానం గురించి ముక్క మాట్లాడలేదు. స్పీకర్‌కు అభినందనలు తెలిపే సందర్భంలోనూ తామిచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించలేదు. స్పీకర్‌గా నిష్పాక్షికతను నిరూపించుకునేందుకు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని కొత్త సభాపతిని కోరలేదు. ఆ తరువాత డిప్యూటీ స్పీకర్‌కు అభినందనలు చెప్పే సమయంలోనూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే అవిశ్వాస తీర్మానం పట్ల చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది.
ఎన్నికల భయం కాకపోతే ఇంకేమిటి?
అవిశ్వాస తీర్మానం అంటూ ప్రతిపాదించిన తరువాత ఓటింగ్ జరిగి ప్రభుత్వం పడిపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రమాదం ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తరువాత.. దానిని సభలో పెట్టించుకునేందుకు ఎంత తీవ్రంగా యత్నిస్తుందో రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా? అణు ఒప్పందం బిల్లు ఆమోదం విషయంలో యూపీఏ-1 ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఢిల్లీలో మకాం వేసిన బాబు.. ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వం విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ప్రభుత్వం పడిపోతే ఎన్నికలు వస్తాయని భయం కాకపోతే ఇంకేమిటి? అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుంది అన్న విషయం తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన సహచరులకు తెలియదనుకోవాలా? శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ రాకముందే అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేయటంలోనే.. ఈ అంశం పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో టీడీపీ ఇచ్చిన నోటీసు చెల్లుబాటు కాదని విమర్శలు వచ్చిన తరువాత ఎన్నిసార్లు అయినా ఇస్తామని ఆయన ప్రకటించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
సభ వెలుపల హైడ్రామా...
శాసనభలో మాట్లాడేందుకు అవకాశం వచ్చినపుడు మాటమాత్రంగా కూడా ప్రస్తావించని చంద్రబాబు సభ నిరవధిక వాయిదా పడిన తరువాత మాత్రం హంగామా సృష్టించారు. కొద్దిసేపు పోడియంలో ధర్నా చేశారు. మామూలుగా ఏదైనా అంశపై చర్చ కావాలని గట్టిగా అనుకున్నప్పుడు స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేసిన సందర్భాలున్నాయి. అయితే, శాసనసభ ఆవరణలో మీడియాకు అవకాశం లేని సంగతిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తన డ్రామాను రాజ్‌భవన్‌కు మార్చారు. అక్కడ మీడియా కోసం హంగామా సృష్టించారు. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద నాటకమే ఆడారన్నది స్పష్టమవుతోంది. గెలిచే అవకాశం లేని స్పీకర్ పదవికి పోటీ చేయటం ద్వారా.. కాంగ్రెస్‌తో తనకు అనైతిక బంధం లేదని చెప్పుకునేందుకు, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించేందుకే పెద్ద డ్రామా ఆడారు. కానీ కాంగ్రెస్‌తో తనకు బలమైన అనుబంధం ఉన్నదని ఇదంతా రుజువు చేసింది.
బాబు కోరుకున్నదేమిటి...?
నిజంగా కాంగ్రెస్‌కు తనకు ఏ బంధం లేదని చంద్రబాబు రుజువు చేయదలిస్తే అతి ముఖ్యమైన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు అటకెక్కించారు? సంప్రదాయంగా అధికారపక్షానికి మాత్రమే దక్కే స్పీకర్ పదవి మీద చూపిన ధ్యాస అవిశ్వాస తీర్మానంపై ఎందుకు చూపలేదు? తీర్మానం చర్చకు వచ్చి ఉంటే గిట్టుబటు ధర లేక కూనారిల్లుతున్న రైతు సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వచ్చి ఉండేది కదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ రాయితీ దొరక్క ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం వచ్చి ఉండేది కదా? పావలా వడ్డీ దొరక్క కష్టాల్లో కూరుకుపోయిన మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి ఆస్కారం ఉండేది కదా? టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పేరైనా ఉండేది కదా? కానీ చంద్రబాబు వీటినేవీ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉందని చెప్పేందుకు పరోక్షంగా తన సాయం అందించారు. అధికార - ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసి.. అమాయక ప్రజల్ని అన్యాయం చేశాయి.
పుణ్యాత్ములకు మాత్రమే...
కాంగ్రెస్-టీడీపీల అనైతిక పొత్తును.. ఆ రెండు పార్టీలను మోస్తున్న ఎల్లో మీడియాను చూస్తే దేవతావస్త్రాల కథ గుర్తుకు రాకమానదు. ఒకప్పుడు ఓ రాజు దగ్గరకు కొందరు నేత కార్మికులు వచ్చి తాము దేవతావస్త్రాలు తయారు చేస్తామని, వాటిని ధరిస్తే పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తాయని, పాపాత్ములు వాటిని చూడలేరని నమ్మబలికారు. ఆ రాజు వారు సమర్పించినదేవతావస్త్రాలు వేసుకుని ఊరేగుతున్నాడు. రాజు ఒంటిపై వస్త్రాలు లేకపోయినా.. లేవని అంటే పాపాత్ములమని ముద్ర పడుతుందన్న ఉద్దేశంతో ఎవ్వరూ నోరు మెదపటం లేదు.
చివరకు ఓ కుర్రాడు మాత్రం రాజు గారి ఒంటిపై బట్టలే లేవోచ్ అంటూ అరిచాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలను మోస్తున్న రామోజీరావు, వారి వందిమాగధుల పరిస్థితి అచ్చు అలాగే ఉంది. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ రెండూ అంటకాగి పచ్చిగా నగ్నంగా అనైతిక పొత్తు కొనసాగిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నా.. ఎల్లో మీడియాకు మాత్రం ఆ పార్టీలు తొడుక్కున్న దేవతా వస్త్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీల గురించి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తాము చెప్పేవే నిజాలని, అవే నమ్మాలని, నమ్మింపజేయాలని తెగ తాపత్రయపడుతున్నాయి.

No comments :
Post a Comment