వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం

మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మైదుకూరు ఓదార్పు యాత్ర’ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఉదయం పులివెందుల నుంచి ప్రొద్దుటూరు బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా అభిమాన జన సమూహం నీరాజనాలు పలికింది. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు చేరుకున్న జగన్, అక్కడ కానపల్లి రామచంద్రారెడ్డి నివాసంలో జరుగుతున్న వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చాపాడు మండలంలో యాత్రకు బయలుదేరతారు.

అక్కడ మడూరు పంచాయతీ చెంచుపల్లి గ్రామంలోని కామనూరు దేవరాజు కుటుంబాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఓదారుస్తారు. అన్నవరం గ్రామంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ గ్రామ నాయకులు పట్టాభిరామిరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇళ్లకు వెళతారు. అక్కడ నుంచి గుంతచీపాడు మీదుగా మైదుకూరు చేరుకుంటారు. ప్రొద్దుటూరు రోడ్డులోని కంచెం వెంకటమ్మ ఇటీవల మృతి చెందారు.
వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అలాగే పట్టణంలోని వనిపెంటరోడ్డులో ఉంటున్న హాజీపీరా కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం మైనార్టీ నాయకుడు మదీనా దస్తగిరి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడే భోజనం చేసి వెంకటాపురం, గొల్లపల్లె గ్రామాల మీదుగా లింగాలదిన్నె చేరుకుంటారు. అక్కడ మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉత్సలవరం, లెక్కలవారిపల్లె, నల్లపురెడ్డిపల్లెలలో కూడా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. గంజికుంట దళితవాడలోని బుక్కె పెద్ద ఓబుళమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం గంజికుంటలోనే వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి వనిపెంట మీదుగా పులివెందులకు వెళతారు

No comments :

Post a Comment

Total Pageviews

Status