* రైతు ముఖంలో చిరునవ్వులు చూసే రోజు త్వరలోనే వస్తుంది
* విద్యార్థి చదువునే కాదు.. అతడి పేదరికాన్ని కూడా వైఎస్సార్ చూశారు
ఓబుల దేవరచెరువు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘మహానేత వైఎస్
సువర్ణ యుగం మళ్లీ వస్తుంది. ప్రతి రైతు ముఖంలోనూ చిరునవ్వులు చూసే ఆ
రోజులు త్వరలోనే వస్తాయి. అవ్వా.. తాతల ముఖాల్లో ఇప్పుడున్న చిరునవ్వు కంటే
ఇంకా చిక్కటి చిరునవ్వులు పూసే రోజులు త్వరలోనే వస్తాయి. కచ్చితంగా
వస్తుంది.. వైఎస్ సువర్ణ యుగం త్వరలోనే మళ్లీ వస్తుంది’ అని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో రెండో రోజు మంగళవారం ఓదార్పు యాత్ర కదిరి, నల్లమాడ, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లో 96 కిలోమీటర్ల మేర సాగింది. ఓబుల దేవరచెరువుమండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనం భారీగా వచ్చారు. వైఎస్సార్ సర్కిల్‌కు కిక్కిరిసి వచ్చిన ప్రజలనుద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..
విద్యార్థి పేదరికాన్ని వైఎస్సార్ చూశారు
మహానేత వైఎస్సార్ ఒక్క చదువులనే చూడలేదు. విద్యార్థి పేదరికాన్నీ చూశారు. ప్రతి పేద విద్యార్థి కుటుంబం అప్పుల పాలు కాకుండా తమ పిల్లలను చదివించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తెచ్చారు. ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మను లక్షాధికారిని చేసేందుకు పావలా వడ్డీకే రుణం పథకం తెచ్చారు. పేద విద్యార్థులు పాఠ్య పుస్తకాలు తిరగేస్తున్నపుడు పాఠాల మధ్య వైఎస్సార్ గుర్తుకు వస్తూనే ఉంటారు. కానీ ఈ రోజు ఆయనలా పేద ప్రజలకు సేవ చేయాలని, వారికి దగ్గర కావాలని, ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలనే ఆలోచన.. తపన.. తాపత్రయం ఉన్న నేతలు రాష్ర్టంలో ఒక్కరూ లేరు.
నీచ రాజకీయాలను దేవుడు చూస్తున్నాడు..
ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఆ నీచ రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని అనుకుంటున్నారు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా మీ రెండు పార్టీలకూ డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు ఓడిస్తారు.
బొత్స కొత్తబిచ్చగాడు: కాపు రామచంద్రారెడ్డి
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొత్త బిచ్చగాడని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఓబుల దేవర చెరువులోని కొండకమర్లలో ఆయన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘జగన్‌కు మద్ద తు ఇస్తున్నందుకు మా పదవులను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేను వైఎస్సార్ బొమ్మపెట్టుకొని ఎన్నికల్లో గెలిచాను. ప్రజల కోసం పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కిరణ్, బొత్స పదవుల కోసం ప్రజలను వదులుకుంటున్నారు. సోనియా బొమ్మపెట్టుకొని ఎన్నికల్లో గెలిచామని చెప్తున్నారు. మీకు దమ్ముంటే రాజీనామాలు చేసి సోనియాబొమ్మపెట్టుకొని తిరిగి గెలవండి’ అని డిమాండ్ చేశారు.

No comments :
Post a Comment