ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన

కళ్యాణదుర్గం, కంబదూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘విత్తనాల ధరలు పెరిగాయి.. ఎరువుల ధరలు పెరిగాయి.. డీజిల్ రేట్లు పెరిగాయి.. ఇలా అన్ని రకాలుగానూ రైతుకు ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఇన్ని ఖర్చులూ భరించి పంట పండిం చిన రైతుకు కనీస మద్దతు ధర మాత్రం దొరకని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందులో విఫలమైంది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన తెలుగుదేశం.. అధికారపక్షంతో కుమ్మక్కైంది.. ఇక అన్నదాతలు ఎలా బతకాలి? ఈ గుండె కోత ఎన్నాళ్లు?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 కిలోలున్న వేరుశనగ విత్తనాల బస్తా ధర గత ఏడాది రూ.750 ఉంటే ఈ ఏడాది రూ.1,050కి పెరిగిందని, ఈ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు కూడా అందించలేని పరిస్థితిలో ఉందని మండిపడ్డారు.
శుక్రవారం ఐదో రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లోని దాదాపు 45 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలోనే వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని, పేదల ముఖాల్లో చిరునవ్వులు పూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
మహానేత మరణించాక..: ‘వైఎస్సార్ బతికున్న రోజుల్లో హంద్రీ-నీవా ప్రాజెక్టువైపు చూస్తే చకచకా పనులు జరిగేవి. ఈ ఏడాది కాకుంటే మరో ఏడాదిలో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని, అనంతపురం జిల్లా సస్యశ్యామలం అవుతుందని రైతులు ఆనందపడ్డారు. కానీ ఆ మహానేత మరణించాక పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైనా నిలదీసి గాడిలో పెడుతుందని ఆశతో చూస్తే.. చంద్రబాబునాయుడు అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు’ అని జగన్ దుయ్యబట్టారు.
ప్రజలపై బాదుడే బాదుడు..
అర్ధరాత్రి 12.45కు కళ్యాణదుర్గంలో అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మహానేత వైఎస్సార్ మరణించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను రేట్ల పెంపుతో బాదుతున్నాయి. ఈ రోజు డీజిల్ మీద రూ.3, గ్యాస్ మీద రూ.50, కిరోసిన్ మీద రూ.2 పెంచారు. ఒకనెల క్రితమే పెట్రోలు మీద ఐదు రూపాయలు పెంచారు. కరెంటు చార్జీలు పెంచారు. మరోవైపు రేషన్‌కార్డులు రద్దు, కొత్తగా ఇళ్లు ఇవ్వరు, పెన్షన్లివ్వరు.. ఎటుచూసినా బాదుడే బాదుడు.. ఇంత అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దివంగత మహానేత బతికున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే.. మహిళలపై భారంపడొద్దని రూ.50 ప్రభుత్వమే భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 భారాన్ని తానే భరించాలి’ అని డిమాండ్ చేశారు.
కల్లోలిత పల్లెల్లో.. అనురాగ హారతులు
కల్లోలిత పల్లెలు ఏకమయ్యాయి... పగలు, ప్రతీకారాలు మరిచిపోయి ఆత్మబంధువుకు అనురాగ హారతులు పట్టాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం.. నక్సలిజం.. ఆర్వోసీ కార్యకలాపాలతో నిలువెల్లా గాయాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పల్లెల్లో శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రతో సందడి నెలకొంది. కనగానపల్ల్లి, కంబదూరు, కళ్యాణదుర్గం, రాప్తాడు మండలాల్లోని పల్లెలు జగన్ రాకను వేడుకగా జరుపుకున్నాయి. ఉదయం 9.30 గంటలకు అనంతపురం పట్టణంలోని వైఎస్సార్ కాలనీ నుంచి ఐదో రోజు యాత్ర ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఏకధాటిగా 146 కిలోమీటర్లు ప్రయాణించి45 గ్రామాలను పలుకరించారు.
కంబదూరులో హనుమంతరాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. ఏడు చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పది చోట్ల ప్రసంగించారు. ఈ సందర్భంగా పలుచోట్ల వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజలు, నేతలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాత్రి 12:45 గంటలకు కళ్యాణదుర్గం చేరుకున్నారు. రాత్రి ఏడుగంటలకే ఇక్కడికి రావలసి ఉండగా ప్రతిగ్రామంలో జనం ఆయన్ను చూడ్డానికి బారులు తీరడంతో యాత్ర దాదాపు 5గంటలు ఆలస్యంగా సాగింది. ఆయన వచ్చే వరకు ప్రజలు ఓపికగా వేచి ఉన్నారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డిఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం యాత్రలో పాల్గొన్నవారిలో అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నర్సింహయ్య, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, నేతలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments :
Post a Comment