బొత్సతో జగన్ వర్గం ఎమ్మెల్యే ధర్మాన భేటీ

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసు గురువారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ధర్మాన విలేకరులతో మాట్లాడారు. బొత్సతో భేటీకీ రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. కేవలం తన వ్యక్తిగత విషయమై మాత్రమే భేటీలో మాట్లాడానని చెప్పారు. బొత్స సైతం అదే విషయాన్ని చెప్పాడు. కృష్ణదాసు తనను కలవడంలో రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. పిసిసి అధ్యక్షుడిగా కేవలం తనను చూడడానికే వచ్చారని అన్నారు.

కాగా గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. జగన్ హైదరాబాదులో చేపట్టిన ఫీజు పోరు దీక్షలో కూడా కృష్ణదాసు పాల్గొన్నాడు. ఆ తర్వాత జగన్‌తో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధమని, ఆయన రాజీనామా చేయమని ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ బొత్స పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన క్రమంగా కాంగ్రెసుకు దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలోనూ బొత్సతో భేటీ అయ్యాడు.

No comments :

Post a Comment

Total Pageviews

Status