ధరలపై మహాధర్నాతో కేంద్రం దద్దరిల్లాలి
ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
మన ఆకలి కేకలు సోనియా గాంధీకి వినపడేలా నినదిద్దాం
మహానేత చనిపోయేంత వరకు వంటగ్యాస్ ధర పెంచలేదు
ఆయన మరణించాక సిలిండర్‌కు రూ.104 పెరిగింది..
6 నెలల్లో పెట్రోల్ రూ.17 పెరిగింది
కన్నీరు కారుస్తున్న ప్రజల ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది
తాడిపత్రి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘పేదల ఆకలి బాధలను పట్టించుకోకుండా ఎడా పెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు శుక్రవారం అనంతపురం పట్టణంలో తలపెట్టిన మహాధర్నాతో ఢిల్లీ దద్దరిల్లాలి. ధర్నాకు ప్రతి వ్యక్తీ తరలి రావాలి.. మనమందరం కలిసి అనంతపురంలో పెట్టిన ఆకలి కేకలు ఢిల్లీలో ఉన్న సోనియాగాంధీకి వినపడేలా నినదిద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో పదో రోజు బుధవారం ఓదార్పుయాత్రలో భాగంగా ఆయన తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అధికార పక్షం నేతలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రజలను ఓదార్పు యాత్రకు రాకుండా చేసేందుకు యత్నించినా.. జనం ఈ కార్యక్రమానికి వెల్లువలా వచ్చారు. తాడిపత్రి రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. రావాల్సిన సమయం కంటే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ తనను చిరునవ్వుతో స్వాగతించిన జనానికి ఆయన ధన్యవాదాలు తెలుపుకొన్నారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
మహానేత మరణించాక ఎడా పెడా బాదుడే..: ఇవాళ బాధెక్కడనిపిస్తుందంటే.. దివంగత మహానేత బతికున్న ఐదేళ్ల కాలంరూ.300 ఉన్న వంట గ్యాస్ ధర ఆయన చనిపోయేంత వరకు కూడా అంతే ఉంది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత అదే గ్యాస్ ధర రూ.404కు పెంచారు. గతేడాది లీటర్ రూ.11 ఉన్న కిరోసిన్ ధరను రూ.13కు పెంచారు.. ఇవాళ అది రూ.15కు చేరింది. పెట్రోల్ ధరను ఆరు నెలల్లో రూ.17 పెంచారు. ఇలా కనిపించిన ప్రతి వస్తువుకు ధరలు పెంచుకుంటూ పోతే పేదలు ఎలా బతకాలి? పేద ప్రజల బాధలు మీకు(పాలకులకు) పట్టవా?
సర్కారే మోసం చేస్తే..
ఈ ప్రాంతం(తాడిపత్రి)లో ఎక్కువగా వేసే వేరుశనగ విత్తనాల 30 కేజీల బస్తా ధర
నిన్నటికి నిన్న రూ.750 ఉంటే ఇవాళ రూ.1,080కు పెంచారు. అవి కూడా నకిలీ
విత్తనాలు ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవాళ వెస్ట్ నర్సాపురం
రైతులు నన్ను కలిశారు. అన్నా ఈ విత్తనాలు చూడన్నా.. సర్కారు దగ్గరే
కొన్నాం.. నకిలీ విత్తనాలు మాకు అంటగట్టారు. ఒక్క విత్తనం మొలకెత్తలేదన్నా
అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నేనడుగుతున్నా.. సర్కారే నకిలీ
విత్తనాలిచ్చి రైతులను మోసం చేసినపుడు ఇక ఆ రైతుల గోడు ఎవరు
పట్టించుకోవాలి?
అందరి కంటా కన్నీరే..
ఇవాళ నాగలి దున్ని రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు సోదరుడిని చూస్తే నిజంగా బాధనిపిస్తోంది.. దివంగత మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదంటే బాధనిపిస్తోంది. ఒక్క వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదంటే బాధనిపిస్తోంది.. ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టివ్వ లేదంటే బాధనిపిస్తోంది. పేదలు, రైతు సోదరులు, ప్రతి అక్కా, చెల్లెమ్మ , ప్రతి అవ్వా తాతా, ప్రతి చేనేత కార్మికుడూ.. ఇవాళ ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. వీరి ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది.
115 కిలోమీటర్లు.. 45 గ్రామాలు..
తొమ్మిదో రోజు మంగళవారం ఓదార్పు యాత్ర జన తాకిడితో బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు ముగిసింది. గార్లదిన్నెలో సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి పదో రోజు యాత్రను తిరిగి ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి ప్రారంభించారు. పెద్దపప్పూరు, కొండాపురం, శింగనమల, నార్పల, తాడిపత్రి, యాడికి మండలాల్లో సుమారు 115 కిలోమీటర్లు పర్యటించి దాదాపు 45 గ్రామాలను పలకరించారు. 12 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. చిక్కేపల్లి గ్రామంలో వెంకట రాఘవరెడ్డి, శింగనమల గ్రామంలో నీలంపల్లి శ్రీనివాసులు కుటుంబాలను ఓదార్చారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయానికి జగన్‌మోహన్‌రెడ్డి యాడికిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కూడా యాత్ర కొనసాగింది.
తరలివచ్చిన నేతలు...
బుధవారం యాత్రకు తరలివచ్చిన నేతల్లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పైలా నర్సింహయ్య, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్‌రెడ్డి, జొన్నా రామయ్య, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, నేతలు గిర్రాజు నగేష్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
మన ఆకలి కేకలు సోనియా గాంధీకి వినపడేలా నినదిద్దాం
మహానేత చనిపోయేంత వరకు వంటగ్యాస్ ధర పెంచలేదు
ఆయన మరణించాక సిలిండర్‌కు రూ.104 పెరిగింది..
6 నెలల్లో పెట్రోల్ రూ.17 పెరిగింది
కన్నీరు కారుస్తున్న ప్రజల ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది
తాడిపత్రి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘పేదల ఆకలి బాధలను పట్టించుకోకుండా ఎడా పెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు శుక్రవారం అనంతపురం పట్టణంలో తలపెట్టిన మహాధర్నాతో ఢిల్లీ దద్దరిల్లాలి. ధర్నాకు ప్రతి వ్యక్తీ తరలి రావాలి.. మనమందరం కలిసి అనంతపురంలో పెట్టిన ఆకలి కేకలు ఢిల్లీలో ఉన్న సోనియాగాంధీకి వినపడేలా నినదిద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో పదో రోజు బుధవారం ఓదార్పుయాత్రలో భాగంగా ఆయన తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అధికార పక్షం నేతలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రజలను ఓదార్పు యాత్రకు రాకుండా చేసేందుకు యత్నించినా.. జనం ఈ కార్యక్రమానికి వెల్లువలా వచ్చారు. తాడిపత్రి రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. రావాల్సిన సమయం కంటే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ తనను చిరునవ్వుతో స్వాగతించిన జనానికి ఆయన ధన్యవాదాలు తెలుపుకొన్నారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
మహానేత మరణించాక ఎడా పెడా బాదుడే..: ఇవాళ బాధెక్కడనిపిస్తుందంటే.. దివంగత మహానేత బతికున్న ఐదేళ్ల కాలంరూ.300 ఉన్న వంట గ్యాస్ ధర ఆయన చనిపోయేంత వరకు కూడా అంతే ఉంది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత అదే గ్యాస్ ధర రూ.404కు పెంచారు. గతేడాది లీటర్ రూ.11 ఉన్న కిరోసిన్ ధరను రూ.13కు పెంచారు.. ఇవాళ అది రూ.15కు చేరింది. పెట్రోల్ ధరను ఆరు నెలల్లో రూ.17 పెంచారు. ఇలా కనిపించిన ప్రతి వస్తువుకు ధరలు పెంచుకుంటూ పోతే పేదలు ఎలా బతకాలి? పేద ప్రజల బాధలు మీకు(పాలకులకు) పట్టవా?
సర్కారే మోసం చేస్తే..
అందరి కంటా కన్నీరే..
ఇవాళ నాగలి దున్ని రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు సోదరుడిని చూస్తే నిజంగా బాధనిపిస్తోంది.. దివంగత మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదంటే బాధనిపిస్తోంది. ఒక్క వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదంటే బాధనిపిస్తోంది.. ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టివ్వ లేదంటే బాధనిపిస్తోంది. పేదలు, రైతు సోదరులు, ప్రతి అక్కా, చెల్లెమ్మ , ప్రతి అవ్వా తాతా, ప్రతి చేనేత కార్మికుడూ.. ఇవాళ ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. వీరి ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది.
115 కిలోమీటర్లు.. 45 గ్రామాలు..
తొమ్మిదో రోజు మంగళవారం ఓదార్పు యాత్ర జన తాకిడితో బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు ముగిసింది. గార్లదిన్నెలో సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి పదో రోజు యాత్రను తిరిగి ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి ప్రారంభించారు. పెద్దపప్పూరు, కొండాపురం, శింగనమల, నార్పల, తాడిపత్రి, యాడికి మండలాల్లో సుమారు 115 కిలోమీటర్లు పర్యటించి దాదాపు 45 గ్రామాలను పలకరించారు. 12 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. చిక్కేపల్లి గ్రామంలో వెంకట రాఘవరెడ్డి, శింగనమల గ్రామంలో నీలంపల్లి శ్రీనివాసులు కుటుంబాలను ఓదార్చారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయానికి జగన్‌మోహన్‌రెడ్డి యాడికిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కూడా యాత్ర కొనసాగింది.
తరలివచ్చిన నేతలు...
బుధవారం యాత్రకు తరలివచ్చిన నేతల్లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పైలా నర్సింహయ్య, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్‌రెడ్డి, జొన్నా రామయ్య, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, నేతలు గిర్రాజు నగేష్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments :
Post a Comment