పెట్రో మంటకు నిరసనగా ప్రజలకు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
రాయదుర్గం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: మోయలేని ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్న ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూలై 1న అనంతపురం జిల్లా కేంద్రంలో మహాధర్నా చేపడదామని ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి మహిళా తన భర్తతో కలిసి ఈ ధర్నాలో పాల్గొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మీద కేంద్రం మోపిన వంటింటి భారం దించేందుకు పెంచిన గ్యాసు ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఆరో రోజు శనివారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
పేదల బాధలు అర్థంకావా?
దివంగత మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. నిన్నటికి నిన్న డీజిల్ మీద రూ.3, గ్యాస్ మీద రూ.50, కిరోసిన్‌పై రూ.2 చొప్పున పెంచారు. ఎక్కడ బాధనిపిస్తుందంటే.. పేదలు వాడుకునే లీటర్ కిరోసిన్‌ను గతేడాదే రూ.11 నుంచి రూ.13కు పెంచారు.. మళ్లీ ఇప్పుడు రూ.2 పెంచడంతో అది రూ.15కు చేరింది. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తే పేదవాడు ఏం కావాలి? పేదలు పడే బాధలు మీకు(పాలకులకు) అర్థం కావా?
ప్రభుత్వమే భరించాలి.
ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మీద వంటింటి భారం దించేందుకు.. గ్యాస్‌పై పెంచిన రూ.50ను రాష్ట్ర ప్రభుత్వమే భరించినా ఖజానాపై ఏమాత్రం అదనపు భారం పడదు. డీజీల్ మీద పెంచిన ధరలలో 22.25 శాతం.. సుంకం రూపంలో రాష్ట్రానికి వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.462 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఊహించని రాబడి. గ్యాసు మీద రూ.50 సబ్సిడీ ఇస్తే ప్రభుత్వం మీదపడే భారం కేవలం రూ.450 కోటు.్ల అయినప్పటికీ రూ.462 కోట్లలో ప్రభుత్వానికి ఇంకా రూ.12 కోట్లు మిగులుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే .. పెంచిన భారం ప్రజల మీద పడకూడదన్న ఉద్దేశంతో ఆ భారాన్ని ఆ మహానేత ప్రభుత్వమే భరించింది.
ప్రజలపై బాదుడే బాదుడు..
ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వాలు ఎప్పుడుపడితే అప్పుడు ఎడాపెడా ధరలు పెంచుతూ పోతున్నాయి. ధరలు పెంచి పేదలను బాదుడే బాదుడు బాదుతున్న ఈ పాలకులకు జ్ఞానోదయం కలిగించు దేవుడా అని ఆ దేవుడికి రెండు చేతులెత్తి వేడుకుంటున్నా. పేదల బాధలు ఈ పాలకులకు అర్థంకావు. ప్రజల నిరసనతోనైనా ఈ చేతగాని ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోనని జూలై 1న అనంతపురం జిల్లా కేంద్రంలో మహాధర్నాకు పిలుపునిస్తున్నాను. నేను కూడా ఈ ధర్నాలో పాల్గొంటా. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ వారి వారి భర్తలతో కలిసి ధర్నాలో పాల్గొనండి.
అభిమాన కెరటాలు...
అనంతపురం జిల్లాలో ఆరో రోజు శనివారం ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి అభిమాన కెరటాలు ఉరకలెత్తాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులను సైతం లెక్కచేయకుండా నాయకులు, ప్రజలు తరలివచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న జనం మద్దతును చూసి జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఆదర్శ రైతులకు, రేషన్ డీలర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు నేరుగా ఫోన్ చేసి ఓదార్పులో పాల్గొంటే ఉద్యోగాలు తీసేయిస్తామని చెప్పినట్లు సమాచారం. కొన్ని చోట్ల జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు.
అడ్డంకులు ఎన్ని ఉన్నా జనం మాత్రం యాత్రతో మమేకమయ్యారు. శనివారం ఓదార్పుయాత్ర కళ్యాణదుర్గం, గుమ్మఘట్ట, రాయదుర్గం, బొమ్మనహాళ్ మండలాల్లో ఏకధాటిగా 136 కిలోమీటర్ల మేర సాగింది. జగన్‌మోహన్‌రెడ్డి ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించి, మదిగల్లు గ్రామంలో ఎలవర్తి సత్యనారాయణరెడ్డి, దేవరెడ్డిపల్లిలో గొల్ల బిరుసు పెన్నయ్య, గొల్లపల్లి గ్రామంలో రొడ్డచెయ్యి తిప్పేస్వామి కుటుంబాలను ఓదార్చారు. రాత్రి 12 దాటాక కణేకల్లు మండలం యర్రగుంట గ్రామం చేరుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవరెడ్డి ఇంట్లో బసచేశారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్నవారిలో అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి తదితరులు ఉన్నారు.

No comments :
Post a Comment